ఆకస్మిక అనారోగ్య కారణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. దెందులూరు మండలానికి చెందిన పలువురు వింత వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి..బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సకాలంలో సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఓ బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్పించిన చాలా సమయం వరకు తేరుకోకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
ఇదీ చదవండి: నేడు ఏలూరుకు కేంద్రం బృందం రాక