తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా సాగు ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం, లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆక్వా రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంక్షోభంలో రొయ్యల పరిశ్రమలు
రొయ్యల సాగుపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది. స్థానికంగా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే.. ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఆ స్థాయిలో రైతులకు ఆశించిన ధర చెల్లించలేని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారు. తాజాగా సరకు కొనుగోలుకే ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు రొయ్యల మేత ధరలూ భారంగా మారాయి. వైరస్ కారణంగా నిలిచిపోయిన లావాదేవిలతో చేసేదిలేక ఆక్వా రైతులు.. ఉత్పత్తులను చెరువులోనే వదిలివేస్తున్నారు.
సమస్యలపై నేడు మంత్రుల సమీక్ష
ఆక్వా రైతుల సమస్యలపై ఇవాళ ఉదయం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: