తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్ల నిధులతో ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య ఆసుపత్రి నిర్మాణాలకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. అమలాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో... సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్‌తో కలిసి స్థల సేకరణ కోసం రైతులతో చర్చించారు. అమలాపురం బైపాస్ రోడ్డు నుంచి తొమ్మిది వందల మీటర్ల పరిధిలో 50 ఎకరాల భూమిని వైద్య కళాశాలకు సేకరించేందుకు గుర్తించామని మంత్రి వెల్లడించారు. ఎకరానికి 74 లక్షల 50 వేల రూపాయలు చొప్పున రైతులకు చెల్లిస్తామని వివరించారు. మంచి హృదయంతో రైతులు అంగీకరించారని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండీ... శ్రీవారి సేవలో ముఖ్యమంత్రులు జగన్, యడియూరప్ప