ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బడుగు వికాసం ప్రవేశపెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్‌టీయూకేలో నిర్వహించిన పారిశ్రామిక పాలసీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టడానికి గల కారణాలు, దీని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
బహుజన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ అధ్యక్షుడు క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వివిధ రాయితీలు కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, జేఎన్‌టీయూకే వీసీ రామలింగరాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: