ETV Bharat / state

సీఎం నిర్ణయం వల్లే.. తెదేపా ఇంకా ఖాళీ అవ్వలేదు - minister kannababu comments about chandrababu news

అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్​పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు నాయుడు.. అక్కడ ఒక్క శాశ్వత నిర్మాణమైనా ఎందుకు కట్టలేదని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. జగన్​కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు
author img

By

Published : Nov 5, 2019, 6:47 AM IST

సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకే ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిపై ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం జరగకపోవడానికి జగన్‌ కారణమని విమర్శిస్తున్న చంద్రబాబు.. ఇప్పటివరకూ అక్కడ ఒక్క శాశ్వత నిర్మాణమైనా చేపట్టలేదని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకుని ఉండకపోతే తెదేపాలో ఎవరూ మిగిలేవారు కాదని ఎద్దేవా చేశారు. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేనంత వరద వచ్చిందనీ.. వరదల్లో ఇసుక తీసుకునే సాంకేతికత ఉంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వాలన్నారు. ఆధారాలు లేని వార్తలు ప్రచురిస్తే కేసులు తప్పవని.. ఈ విషయంలో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే నిర్ణయం ఏమీ లేదని స్పష్టంచేశారు.

సీఎం నిర్ణయం వల్లే.. తెదేపా ఇంకా ఖాళీ అవ్వలేదు

ఇదీచూడండి.అన్నవరం బృహత్తర ప్రణాళిక ఆమోదం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.