రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెదేపా ఆరోపించడం దారుణమని...రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్ కాకినాడలో అన్నారు. బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం తమదని...బీసీ, ఎస్సీలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం జరిగినట్లు... తెదేపా నాయకులు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
తప్పు ఎవరు చేసినా వదలిపెట్టం: మోపిదేవి
రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి చేశారా లేదా తెదేపా నాయకులు చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అరెస్ట్ చేశారని మంత్రులు స్పష్టం చేశారు. దీని వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నా అరెస్ట్ తప్పదని...తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే పరిస్థితి ఉండదన్నారు. దీనికి కులాన్ని ఆపాదించడం సరికాదన్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌ను పోలీసులతో అడ్డుకుని రాజకీయం చేయలేదా అని వారు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: అక్రమాలు చేస్తేనే అరెస్టు చేసింది : మంత్రి అనిల్