తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి 40మంది వలస కార్మికులు రంపచోడవరం చేరుకున్నారు. లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. రాత్రుళ్ళు చీకటిని సైతం లెక్క చేయకుండా కాలి నడకన పయనం సాగిస్తున్నారు. చైన్నైలో పనులకు వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన సుమారు 40 మంది… రాత్రి గోకవరం మీదుగా కాలి నడకన రంపచోడవరం వైపు ప్రయాణం సాగించారు. చీకట్లో రోడ్డు పక్కనే కొంతసేపు విశ్రాంతి తీసుకుని… ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి ప్రతీ వలస కూలీకి దారి ఖర్చుకు రూ.500 సాయం: సీఎం జగన్