తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురంలో విషాదం నెలకొంది. అడవి జంతువులను వేటాడి.. సొమ్ము చేసుకునేందుకు.. అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కలిదిండి సురేష్ పశువులు కాస్తూ.. వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లి తిరిగి వస్తుండగా... విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫారెస్టు అధికారులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆరోపించారు. జరిగిన ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: