అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోతాడనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద జరిగింది. రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన పేపకాయల శ్రీను(27) , మేడిశెట్టి పాప రాజులు ఈ నెల 9వ తేదీన దొంతమూరు గ్రామానికి టాక్టర్పై ఎండు గడ్డిని తీసుకుని వస్తున్నారు. గడ్డికి కరెంటు తీగలు తగలడంతో మంటలు వ్యాపించి గడ్డిపై కూర్చున్న పాపరాజుకు గాయాలయ్యాయి. బాధితుడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను చనిపోతాడనే భయంతో శ్రీను అక్కడినుంచి పిచ్చుకలంకకు వచ్చి వంతెన రైలింగ్కు ఉరి వేసుకున్నాడు.
ఇదీ చూడండి.