తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామస్థులు ఇళ్ల స్థలాలు కోసం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా.. ఊరికి దూరంగా స్థలాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కొండల మధ్య, అడవిలో కాలవ పక్కన ఆ స్థలాలు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు స్పందించి ఆ స్థలాలను రద్దు చేసి ఊరికి దగ్గరగా ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: 'పేదలకు ఇళ్లు నిర్మిస్తే... వ్యవసాయ భూములు మునిగిపోతాయి'