తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో చతుర్వేద హవన సహిత మహా వైకుంఠ నారాయణ యాగం ఘనంగా ముగిసింది. ఈ నెల 11న ప్రారంభమైన ఈ క్రతువులో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, చతుర్వేద హవనాలు, పంచాయతన యాగాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు పూర్ణాహుతితో యాగాన్ని ముగించారు. లోక కల్యాణార్ధం యాగం నిర్వహించినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
కొత్తపేట పుణ్యక్షేత్రాలను సందర్శించిన శారదాపీఠం ఉత్తరాధికారి