తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలోని శివాలయంలో... కార్తీకమాసం సందర్భంగా మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 15 అడుగుల సైకత శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది.
ఇదీ చదవండి: ఆలయాల్లో ఆన్లైన్ సమస్య... టిక్కెట్ల కోసం భక్తుల బారులు