lovers suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలం ఎదురులంక గోదావరిలో యువజంట ఆత్మహత్య చేసుకుంది. వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గుర్తించి వెంటనే రక్షించే ప్రయత్నం చేయగా అమ్మాయి మృతదేహం లభ్యమైంది. యువతి యానాం పెర్రీ రోడ్డులోని నివాసముండే పాలెపు శాంతిగా గుర్తించారు. యువకుడి మృతదేహం లభ్యం కాకపోవటంతో పోలీసులు నాటు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. యువతి తల్లి గతంలో యానాం పోలీస్‌స్టేషన్‌లో శివరామ సాయి అనే యువకుడిపై కేసు పెట్టినట్లు సమాచారం. గోదావరిలో దూకింది. అతనా కాదా అనేది నిర్ధారణ కావల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: రేప్‌ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం