ETV Bharat / state

'ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. పెద్దవాళ్లు ఒప్పుకోవటం లేదు'

ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు.. అమ్మాయి తరఫు బంధువుల నుంచి తమకు ప్రాణ హాని ఉందనీ.. రక్షణ కల్పించాలని ఓ జంట తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది.

love marriage couple complaint in sp office
ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన ప్రేమ జంట
author img

By

Published : Sep 28, 2020, 11:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన వరప్రసాద్, కృష్ణా జిల్లా కంకిపాడుకి చెందిన దీపిక ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం నచ్చని అమ్మాయి తరఫు బంధువులు తమను బెదరిస్తున్నారనీ.. వారి నుంచి, స్థానిక రాజకీయ నాయకుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తాము ఏడాదిన్నరగా ప్రేమించుకుని, ఈ నెల 21న పెళ్లి చేసుకున్నట్లు వారు వివరించారు.

తాము మేజర్లమని, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​లో మాట్లాడిన తరువాత కూడా.. కార్లతో వెంబడించి హాని చేయాలని చూస్తున్నారనీ ఆరోపించారు. తమ తల్లిదండ్రులకు ఈ కులాంతర వివాహం ఇష్టం లేదనీ.. అందుకే తమను ఇబ్బందులు పెడుతున్నారని దీపిక ఆవేదన వ్యక్తం చేసింది.

" మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాది కులాంతర వివాహం కావటంతో అమ్మాయి తరఫు బంధువులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారి నుంచి మాకు ప్రాణ హాని ఉంది."- వరప్రసాద్

" రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​లో నా గురించి మిస్సింగ్ కేసు పెట్టారు. నేను కులాంత వివాహం చేసుకున్నానని మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కార్లలలో తిరుగుతున్నారు మా కోసం. వారి నుంచి మాకు ప్రాణ హాని ఉంది. అందుకే మా తల్లిదండ్రులపై కేసు పెడుతున్నా." - దీపిక

ఇదీ చదవండి:

అమలాపురం తెదేపా బాధ్యురాలికి శ్రేణుల అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.