లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి తరలివస్తున్న విద్యార్థులు, ఉద్యోగులను తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో గుంపులు గుంపులుగా తరలివెళ్లటం నిషేధమని తేల్చి చెప్పారు. తమకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వ అనుమతితో..గమ్యస్థానాలకు బయల్దేరామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోని పోలీసులు వారిని అన్నవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీచదవండి