ETV Bharat / state

అయినవిల్లి మండలంలో పూర్తి స్థాయి లాక్ డౌన్

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున.. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరకుల దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

lockdown at ainamilli due corona pandemic
అయినవిల్లి మండలంలో పూర్తి స్థాయి లాక్ డౌన్
author img

By

Published : Jun 13, 2020, 3:41 PM IST

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అయినవిల్లి మండలంలో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మండలాన్ని మొత్తంగా రెడ్ జోన్ గా ప్రకటించారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరకుల దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అమలాపురం ఆర్డీవో భవాని శంకర్, అమలాపురం డీఎస్పీ షేక్ మాసుమ్ బాషా.. ఈ మండలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.