రాజోలు మండలం కడలి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఒక్క వార్డు కూడా రిజర్వ్ చేయకపోవటంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో 1450 మంది బీసీ ఓటర్లులున్నా ఒక్క వార్డు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ, ఎస్సీ వర్గీయులకే వార్డులు రిజర్వ్ చేశారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ..విశాఖ మన్యంలో.. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా