పుర ఎన్నికల ఏర్పాట్లపై వివిధ జిల్లాలో అధికారులు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సూచనలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా
మున్సిపల్ ఎన్నికలను అందరూ కలసి విజయవంతంగా పూర్తిచేయాలని అధికారులకు మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు బీఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు . అమలాపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎస్కేబీఆర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ , బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వాటి ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కర్నూలు జిల్లా
గూడూరు నగర పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడిన అన్ని పార్టీల అభ్యర్థులతో కమిషనర్ శ్రీనివాసులు ఎన్నికల నియమావళిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని ఎస్సై నాగార్జున తెలిపారు.
నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు బసంతకుమార్ సమీక్షించారు. మూడు వార్డుల్లో ఏకగ్రీవాలు కాగా మిగతా 23 వార్డుల ఎన్నికల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. 10న జరిగే ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి