కరోనా ప్రభావంతో మూతపడ్డ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు మద్యం కోసం ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాలు కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నందువల్ల కేవలం ఒక మద్యం దుకాణానికి మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, మల్కాపురం గ్రామాలలో మద్యం కోసం మద్యం ప్రియులు గంటల తరబడి నిరీక్షించారు. కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న తెనాలి డివిజన్లో ఎక్కువ షాపులకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పడిగాపులు పడుతున్నారు. ఈరోజు నుంచి మద్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించటంతో షాపుల వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు. వెంటనే అమ్మకాలు ప్రారంభించకపోవటంతో మద్యం ఎప్పుడు చేతికొస్తుందా అని వేచిచూస్తున్నారు.
ఇదీ చూడండి: