గంజాయి స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. గంజాయి రవాణాను పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకుంటున్నా.. స్మగ్లర్లు రోజురోజుకు కొత్త ప్లాన్లతో రవాణా చేస్తూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ద్రవరూప గంజాయి తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. చింతూరు వద్ద గత నెలలో ద్రవరూప గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మూఠా మూలాల కోసం తూర్పుగోదావరి-విశాఖ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలతో గాలించారు. విశాఖలోని జీకే వీధి మండలం రాంపుర్‌లోని ఓ పూరింటిలో.. గంజాయిని తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 100గ్రాముల ద్రవరూప గంజాయి, 30లీటర్ల టోలిన్ రసాయనం, చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇలా తయారు చేస్తున్నారు..
పచ్చి గంజాయిని టోలిన్ రసాయనంలో ఒక రాత్రి నానబెట్టి, దాన్ని పిండగా వచ్చిన రసాన్ని కుక్కరులో ఉడకబెడతారు. కుక్కర్ నుంచి ఆవిరి బయటకు వెళ్లే మార్గానికి ప్లాస్టిక్, రాగి ట్యూబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్యూబ్ చివరి భాగాన్ని సీసాలోనికి పెట్టి, దానిలో గాలి ప్రవేశించకుండా చేస్తారు. కుక్కర్‌లోని ద్రావకం బాగా ఉడికిన తరువాత వచ్చే ఆవిరి దానికి అమర్చిన సీసాలోకి వెళుతుంది. టోలిన్ రసాయనం ఆవిరి రూపంలో గొట్టం ద్వారా బయటకు పోయి, కుక్కర్‌లో చిక్కగా నల్లని ద్రావకం చేరుతుంది. దీన్నే ద్రవరూప గంజాయిగా కేజీ చొప్పున ప్యాక్ చేసి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు. దాన్ని సిగరెట్‌లో నాలుగు, అయిదు చుక్కలు వేసుకుని కాల్చుతున్నారు. -ఎం.రవీంద్రనాథ్‌బాబు, తూర్పుగోదావరి ఎస్పీ
ఇదీ చదవండి: