ముంపు గ్రామాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. ఇవాళ ఏడో రోజు కూడా ముంపు ప్రభావం ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండల ప్రజలు వారం రోజుల నుంచి అంధకారంలోనే ఉన్నారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిలువ నీడ లేక చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిస్థితి మారింది. ఓవైపు వర్షాలు కురుస్తుండటంతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సకాలంలో భోజనాలు అందడం లేదని వాపోతున్నారు. కోనసీమలోనూ గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గడ్డిలేక పశువులు అల్లాడిపోతున్నాయి. పంటపొలాలన్నీ మునిగి రైతులు నష్టపోయారు.
వారం రోజులుగా ముంపులోనే లంక గ్రామాలు - దేవీపట్నం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ముంపు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఏడో రోజు కూడా ముంపు ప్రభావం ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. విద్యుత్, తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందజేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముంపు గ్రామాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. ఇవాళ ఏడో రోజు కూడా ముంపు ప్రభావం ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండల ప్రజలు వారం రోజుల నుంచి అంధకారంలోనే ఉన్నారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిలువ నీడ లేక చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిస్థితి మారింది. ఓవైపు వర్షాలు కురుస్తుండటంతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సకాలంలో భోజనాలు అందడం లేదని వాపోతున్నారు. కోనసీమలోనూ గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గడ్డిలేక పశువులు అల్లాడిపోతున్నాయి. పంటపొలాలన్నీ మునిగి రైతులు నష్టపోయారు.
k.veerachari, 9948047582
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గ్రామ వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట పురపాలక కార్యాలయంలో మంగళవారం పట్టణ గ్రామ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి వాలంటీర్లు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటరీని నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఒక క్రమశిక్షణతో ఇంటి ఇంటికి వెళ్లి వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ గ్రామ వాలంటరీగా నియమితులైన యువతీ యువకులు ప్రజలకు చేరువగా వెళ్లాలని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ శ్రీ హరి బాబు తదితరులు పాల్గొన్నారు.
Body:గ్రామ వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించాలి
Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి