తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలారు. ఫలితంగా.. గోదావరి పరివాహక లంక భూములు కోతకు గురవుతున్నాయి. అంతేగాక ముమ్మిడివరం పరిధిలోని లంకల్లో నిటారుగా ఉన్న కొబ్బరిచెట్లు తెల్లవారేసరికి గోదావరిలోకి ఒరిగిపోయి కనిపించాయి. మరికొన్ని కనిపించకుండాపోయాయి. వాటినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వందలాది కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. తాతలకాలంలోని వందల ఎకరాలు ఉన్న లంకభూములు మనవళ్ల కాలానికి వచ్చేసరికి సెంటుభూమి మిగలలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కోతలను ఆపే పనులను చేపట్టలేకపోయారని భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
గోదారి శోకం... లంక రైతుల గుండె"కోత" - east godavari district
గోదావరి లంక రైతులకు గుండెకోతను మిగిల్చుతోంది. ప్రతిఏటా వరదల సమయంలో భూమి కోతకు గురవుతోంది. ప్రస్తుతం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కోత పెరిగింది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలారు. ఫలితంగా.. గోదావరి పరివాహక లంక భూములు కోతకు గురవుతున్నాయి. అంతేగాక ముమ్మిడివరం పరిధిలోని లంకల్లో నిటారుగా ఉన్న కొబ్బరిచెట్లు తెల్లవారేసరికి గోదావరిలోకి ఒరిగిపోయి కనిపించాయి. మరికొన్ని కనిపించకుండాపోయాయి. వాటినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వందలాది కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. తాతలకాలంలోని వందల ఎకరాలు ఉన్న లంకభూములు మనవళ్ల కాలానికి వచ్చేసరికి సెంటుభూమి మిగలలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కోతలను ఆపే పనులను చేపట్టలేకపోయారని భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
k.veerachari, 9948047582
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పూర్తిగా రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ సుధాకర్ డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి ఆవరణంలో గురువారం ఎన్ ఎమ్ సీ బిల్లుకు వ్యతిరేకంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు కారణంగా భవిష్యత్తులో వైద్య విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆరు సంవత్సరాలపాటు రేయింబవళ్లు కష్టపడి ఎం బి బి ఎస్ చదివిన విద్యార్థులు చివరి సంవత్సరంలో కళాశాల పరీక్ష తర్వాత మళ్లీ ఎగ్జిట్ పరీక్ష రాయాల్సి ఉంటుందని, అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీని కారణంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారన్నారు. వైద్యవిద్య నియంత్రించే రాష్ట్రాల హక్కులను హరించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాను తగ్గించి యాజమాన్యానికి 80 శాతం సీట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Body:ఎన్ఎం సి బిల్లును రద్దు చేయాలి
Conclusion:ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ సుధాకర్