ETV Bharat / state

పట్టాల పంపిణీ వ్యవహారంపై కొనసాగుతున్న రగడ - కోరుకొండలో పట్టాల పంపిణీ వివాదం

పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ కొన్నిచోట్ల వివాదాస్పదమవుతోంది. భూసేకరణ, మట్టి తోలకాలతో భూముల మెరక చేసే కార్యక్రమాలకు.. నగదు చెల్లింపుల తీరుపైనా ఆరోపణలు ఎదురవుతున్నాయి.

land distributions
land distributions
author img

By

Published : Jun 26, 2020, 12:41 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల సమీపంలో జిల్లా యంత్రాంగం సేకరించిన ఆవ భూముల వ్యవహారం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముంపు ప్రాంతంలో ఉన్న ఈ భూములు నివాస యోగ్యం కావన్న వాదన ఓ వైపు వినవస్తుండగా.. పరిహారం చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికార పక్షంలోనూ ఈ వ్యవహారంలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ ప్రాంతం ఎత్తు పెంచితే చుట్టు పక్కల గ్రామాలకు ముప్పు వాటిల్లుతోందన్న అభ్యంతరాల నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తెరపైకి వచ్చాయి. దీంతో పరిహారం చెల్లింపుల ప్రక్రియ అర్థాంతరంగా నిలిపేసిన యంత్రాంగం.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భూ వినియోగం సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి బృందాలను నియమించింది.

జిల్లాలో 3.74 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలకు ఏడు వేల ఎకరాల భూమి అవసరమని తేల్చారు. జిల్లాలో ప్రభుత్వ భూములు రెండు వేల ఎకరాలు ఉండగా..రైతులు, డి- పట్టాదారుల నుంచి అయిదు వేల ఎకరాలు సేకరించాలని, మిగిలిన భూమి ప్రైవేటుగా సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో కాకినాడ నగరం సమీపంలోని మడ అడవుల భూములతో పాటు కోరుకొండ మండలంలోని ఆవ భూముల వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తెరపైకి వచ్చాయి. కోరుకొండ మండలం బూరుగుపూడి, కాపవరం గ్రామాల సమీపంలో 587 ఎకరాలను సేకరించి 20 వేల మందికి పట్టాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సేకరించిన భూములకు 50 శాతం మేర చెల్లింపులు జరిగినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ భూముల వ్యవహారంపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో మిగిలిన ప్రక్రియ నిలిచిపోయింది.

ముంపు సమస్యపై వీడని పీటముడి

ఆవ భూములు లోతట్టు ప్రాంతం కావడంతో గోదావరి వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురవుతాయని స్థానికులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం- కోరుకొండ ప్రధాన రహదారితో పోలిస్తే 10 నుంచి 12 అడుగుల లోతున ఆవ భూములున్నాయి. ఇందులో కేవలం 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూములనే అధికారులు ఎంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూముల్లో ఎకరా ప్రాంతాన్ని మట్టి నింపితే రూ.45 లక్షల మేరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎకరం భూమికి భూమి విలువతో అయ్యే ఖర్చు రూ.90 లక్షల వరకు అవుతున్నట్లు సమాచారం.

వరదల సమయంలో ఈ ప్రాంతంలో పడవలపై ప్రయాణించే వారమని.. గతంలో ఈ ప్రాంతం ముంపునకు గురైందని స్థానికులు పేర్కొంటున్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, మునగాల, బుచ్చెంపేట, సీతానగరం మండలం కూనవరం, కాటవరం గ్రామాలు లోతట్టు ప్రాంతాలు కావడంతో పూర్తిగా ముంపునకు గురైతే సుమారు 30 వేల మంది ఖాళీ చేయాల్సి వస్తుందన్నది ఆ పరిసర గ్రామాల ప్రజల వాదనగా ఉంది. వ్యవసాయ భూములకూ ముంపు ముప్పు ఉంటుందని వారు పేర్కొంటున్నారు.12 గ్రామాల ప్రజలు ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వకూడదని నిరసన దీక్షలు చేశారు. ఇప్పటికే ఆరు గ్రామాల ప్రజలు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. గత నెలలో తెదేపా రాష్ట్ర స్థాయి బృందం ఆవ భూముల్లో పర్యటించి ఇళ్ల స్థలాలకు కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

వరద ప్రభావిత ప్రాంతం అని తేల్చినా..

ఆవ భూములు ఇళ్ల స్థలాలకు సేకరించాలని నిర్ణయించడంతో ముంపు ప్రమాదం ఉందా..? లేదా..? తేల్చాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ధవళేశ్వరం జలవనరుల శాఖ సెంట్రల్‌ డివిజన్‌ ఈఈకి మార్చి 7న లేఖ రాశారు. ఈ క్రమంలో ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ రాజమహేంద్రవరం డీఈ మార్చి 8న కోలమూరు, 9న బూరుగుపూడి, కాపవరం వెళ్లి పరిశీలించి ఈ భూమి వరద ప్రభావిత ప్రాంతం అని తెల్చి చెప్పారు. వీఎన్‌పీ సెక్షన్‌ ఏఈ మార్చి 8న రెవెన్యూ యంత్రాంగంతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ భూమి జల్ల కాలువకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. గోదావరికి వరద వచ్చినప్పుడు ఇక్కడా వరదనీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోకవరం ప్రత్యేక విభాగం ఏఈ-నంబర్‌ 2 బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులతో మార్చి 9న సందర్శించి ఈ పరిధిలోని 177 ఎకరాలు గోదావరికి వరదల సమయంలో ముంపు బారిన పడే అవకాశం ఉందని నివేదించారు. ముంపు భూములని తెలిసినా వీటి కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

స్పష్టత వచ్చాకే ముందుకు..

భూ సేకరణ చట్టం నిబంధనల ప్రకారం మార్కెట్‌ విలువకు రెండున్నర రెట్లు అధికంగా చెల్లించవచ్ఛు జిల్లాలో అన్నీ పంట భూములు కావడంతో ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో అన్నీ పరిశీలించాకే కోరుకొండ మండల పరిధిలోని భూములు సేకరించాలని నిర్ణయించాం. అధిక మొత్తం చెల్లించామనడంలో వాస్తవం లేదు. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు చెల్లింపులు నిలిపివేశాం. ఈ భూములు 10-20 ఏళ్లుగా ముంపునకు గురైన దాఖలాలు లేవు. జలవనరుల శాఖ ఆమోదయోగ్యంగా లేవని నివేదిక ఇవ్వలేదు. తాజాగా వివాదాలు తెరమీదికి రావడంతోజలవనరుల శాఖ, కాకినాడలోని జేఎన్‌టీయూ నిపుణుల బృందాలతో అధ్యయనం చేయిస్తున్నాం. ఈ నివేదిక వచ్చిన తర్వాత న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం. -డాక్టర్‌ లక్ష్మీశ, జిల్లా సంయుక్త కలెక్టర్‌

ఇదీ చదవండి: 5 లక్షలకు చేరువలో కేసులు, 15 వేలు దాటిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.