తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కుడుపూడి బ్రదర్స్ సంస్థ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి భోజనాలు అందజేస్తున్నారు. సరుకులు తరలించే వాహనదారులకు, యాచకులకు, నిరాశ్రయులుకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరై అన్న వితరణ చేశారు. కుడుపూడి సంస్థ ప్రతిరోజు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగినదని అభినందించారు.
ఇవీ చదవండి: