గుంటూరు జిల్లాలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ తెలిపారు. సత్వర ఫలితాల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. 18 ట్రూనాట్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జీజీహెచ్ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నామని ప్రకటించారు. 4 కేసులుంటేనే రెడ్ జోన్‌గా ప్రకటిస్తామని అన్నారు. రెడ్జోన్లలో గృహ యజమానులు 3 నెలలపాటు ఇంటి అద్దె అడగరాదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :
నిమ్మగడ్డ పిటిషన్ తిరస్కరించాలంటూ.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్