తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. జిల్లాలోని ఓ గ్రామం నుంచి రెండు రోజుల కిందట ఈ గర్భిణీ జీఎస్ఎల్ ఆస్పత్రిలో చేరింది. 9 నెలలు నిండిన ఈమె ప్రసవానికి కొవిడ్-19 నియమాలు, జాగ్రత్తలను అనుసరించి ఆస్పత్రి అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ డాక్టర్. టి.వి.ఎస్.పి మూర్తి ప్రకటించారు.
ఇదీ చూడండి: రహదారే ప్రసవ స్థలం.. బైక్ అంబులెన్స్‌లో కాన్పు