ETV Bharat / state

విద్యుత్​శాఖ అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యే భేటీ

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సూర్య ప్రకాష్​తో కలిసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నాలుగు మండలాలకు చెందిన విద్యుత్ శాఖాధికారులతో సమావేశమయ్యారు. 30 ఏళ్ల పాటు ఉచిత వ్యవసాయ విద్యుత్ 9 గంటల పాటు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

author img

By

Published : Oct 19, 2020, 6:25 PM IST

Kottapet MLA meeting  with power department officials
విద్యుత్​శాఖ అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యే భేటీ

వ్యవసాయానికి 30 ఏళ్లపాటు నిత్యం 9 చొప్పున ఉచిత విద్యుత్​ అందించడమే వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం గోపాలపురంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సూర్య ప్రకాష్​తో కలిసి నాలుగు మండలాలకు చెందిన విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ విద్యుత్ ఉచిత పథకం పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతరాయాలు ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. 9 గంటల పాటూ ఉచిత విద్యుత్ అందకపోతే అడిగే హక్కు ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అందించే ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు ఒక్క పైసా కూడా కట్టనవసరం లేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చూడండి.

వరద బాధితులను పరామర్శించినందుకే నాపై విమర్శలు: లోకేశ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.