ETV Bharat / state

అధైర్య పడవద్దు.. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం! - కొత్తపేట కోవిడ్ కేర్ సెంటర్​

కొవిడ్ బాధితుల కోసం ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయలు అందిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కరోనా బాధితులెవరు భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితు​లకు వద్దకు వెళ్లి భరోసా కల్పించారు.

mla jaggireddy
కొత్తపేట ప్రభుత్వాసుపత్రి
author img

By

Published : May 11, 2021, 12:19 PM IST

జిల్లాలోని కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితు​లకు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధైర్యం చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి వారికి అందుతున్న వైద్యం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రసూతి విభాగంలో పరీక్షల కోసం వచ్చిన గర్భిణుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొవిడ్ కేర్ సెంటర్​ పక్కనే గర్భిణుల వార్డు ఉండడం వల్ల భయపడుతున్నామని పలువురు తెలిపారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే హాస్పిటల్ ఎదురుగా నిరుపయోగంగా ఉన్న రీ-క్రియేషన్ క్లబ్​ను గర్భిణులకి వైద్యం అందించడానికి ఉపయోగించాలని వైద్యులకు సూచించారు. అందులో సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొవిడ్ బాధితుల కోసం ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తోందని.. ఎవరు అధైర్య పడవద్దని ఆయన భరోసానిచ్చారు.

ఇదీ చదవండి:

ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!

'ఆ నిధుల నుంచే టీకాల కొనుగోలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.