కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని వైకాపా జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజులు తెలిపారు. గోదావరి వరదల వలన నష్టపోయిన రైతులు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి విస్తృత పర్యటనలు చేశారు. అనంతరం అస్వస్థతకు గురై... కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండటానికి నిర్ణయించుకున్నారు. అందువలన 14 రోజుల పాటు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండరని... ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని తెలిపారు.
ఇదీ చదవండి :