తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. బోడుపాలెం వంతెన వద్ద ఉంటున్న ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకగా.. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు.
బయట ప్రాంతం వారు అక్కడికి వెళ్లకుండా.. లోపలున్న వారు బయటకు వెళ్లకుండా రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని.. కారణం లేకుండా బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: