మద్యం దుకాణాలు తెరవటం ద్వారా అనర్థాలు తప్పవని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. కరోనా కట్టడిలో శ్రమిస్తున్న గోకవరం పోలీసులకు ఆయన శాలువాలు కప్పి సన్మానం చేశారు. మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో తమ ట్రస్టు ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందించారు.
ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణలో పోలీసులు సేవలు మరువలేనివన్నారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.