ETV Bharat / state

కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్‌ డాక్టర్ల నిరసన - ap juda problems news

కోవిడ్ విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు.. ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వుత్తులతో నిరసన చేశారు. తమకు రూ. 50 లక్షల బీమా కల్పించాలన్నారు.

కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్‌ డాక్టర్లు నిరసన

author img

By

Published : Aug 11, 2020, 2:39 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్‌ డాక్టర్లు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కోవిడ్‌ విధులకు హాజరైన జుడాలు.. ఓపీ గేటు ఎదురుగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డా.భాస్కర్‌, ఉపాధ్యక్షులు కళాసాగర్‌ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ డాక్టర్లకు 50 లక్షల బీమా కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. నాణ్యమైనీ పీపీఈ కిట్లు, ఎన్ ‌95 మాస్కులు అందించాలని కోరారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులపై కొందరు దాడులు నిర్వహిస్తున్నారని.. ఇలాంటి ప్రమాదకర పరిణామాలను అరికట్టాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

కానిస్టేబుల్ సమయస్ఫూర్తి + ప్రజల అప్రమత్తత = యువకుడి ప్రాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.