వైకాపా ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించే యోచనలో ఉందని డ్వాక్రా యానిమేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ప్రజలకు సేవలు అందిస్తున్న తమను రోడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానిమేటర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: