ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరైన సభకు... జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికర అంశంగా మారింది. ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో సీఎం బహిరంగ సభలో రాపాక పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాపాకను ఆప్యాయంగా పలకరించారు. కొంతకాలంగా వరప్రసాదరావు వైకాపాకు సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే ఆ సభకు రావడంపై ఆసక్తి రేపుతోంది. కాగా... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ను రాపాక వరప్రసాదరావు పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి