ETV Bharat / state

Janasena leader Nadendla Manohar razole tour: 'వైకాపా రెండున్నరేళ్ల పాలనలో.. రహదారులపై రెండడుగులు గోతులు' - Nadendla Manohar visit razole

Janasena leader Nadendla Manohar razole tour: వైకాపా రెండున్నరేళ్ల పాలనలో.. రహదారులు రెండున్నర అడుగుల గోతులు ఏర్పడ్డాయని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పర్యటించిన నాదెండ్ల.. ఇసుక వ్యాపారం, భూకబ్జాలకు అడ్డాగా వైకాపా మారిందని విమర్శింశారు.

Janasena leader Nadendla Manohar razole tour

author img

By

Published : Nov 30, 2021, 5:25 PM IST

Janasena leader Nadendla Manohar razole tour: తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తొలుత తాటిపాక ప్రధాన కూడలిలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజోలులో అధ్వానంగా ఉన్న రహదారులపై శ్రమదానం చేశారు. జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి రాజోలులో పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక అందక భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రభుత్వం.. ఇసుక వ్యాపారం, భూకబ్జాలకు అడ్డాగా మారిందని విమర్శింశారు.

Nadendla Manohar: ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. 30ఏళ్ల కిందట కట్టుకున్న గృహాలకు ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత దిగజారిందని విమర్శించారు. స్థానికులు చందాలు వేసుకుని రహదారులకు మరమ్మతులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలు ప్రజలు చందాలు వేసుకుని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరవును గెలిపిస్తే.. వైకాపా పంచన చేరి గెలిపించిన జనసైనికులనే భయబ్రాంతులు గురిచేయడం బాధాకరమన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టిన రాజోలు జనసైనికులు స్థానిక సంస్థల్లో జనసేనకు విజయం అందించారని అన్నారు.

ఇదీ చదవండి..: Lokesh On Panchayat Funds Transfer Issue: ఆ నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి: లోకేశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.