ఇసుక కొరతను నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా సచివాలయం ఎదుట జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని... అక్రమ ఇసుక రవాణాతో కార్మికులు ఉపాధి కోల్పోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ... బహిరంగ మార్కెట్లో కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాలనాధికారి మురళీధర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరిలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన