ETV Bharat / state

'విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు'

జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కిందన్నారు.

author img

By

Published : Oct 8, 2020, 8:48 PM IST

jagananna visya kanuka kits distribution at east godavari
తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ

జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో... ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను అందజేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కిందన్నారు.

పి.గన్నవరంలో..

ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలని... పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పుల్లేటికుర్రు గ్రామంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు కిట్లను అందించారు. సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంపచోడవరంలో...

ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబు అన్నారు. అడ్డతీగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వైరామవరం మండలం పానశాల పాలెం ఆశ్రమ పాఠశాలలో... జగనన్న విద్య కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే భూమనకు మళ్లీ కరోనా.. చెన్నైలో చికిత్స

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.