- శ్రీకాకుళంలో...
దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్భంధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు, మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
- విజయవాడలో..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని.. అఖిల భారత రైతంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దిల్లీలో రైతులు విజయం సాధించాలని కోరారు. దిల్లీలో 44 రోజులుగా సాగుతున్న రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని రైతు సంఘం నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: