తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెద్దపళ్లలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో... విజిలెన్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పెద్దపళ్ల గ్రామంలో 400 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. డ్రైవర్ భాషను అదుపులోకి తీసుకుని విచారించగా... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళి అనే వ్యక్తి కాకినాడకు కిరాయి మాట్లాడినట్లు తెలిపాడు. మార్గమధ్యలోకి వచ్చిన తర్వాత లారీలో సరకుని మాచవరంలో దింపాలని చెప్పినట్లు డ్రైవర్ వెల్లడించాడు. డ్రైవర్‌తో పాటు, బియ్యం తరలింపులో భాగస్వాములు నాని, ప్రసాద్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: