ETV Bharat / state

MP Bharat : చీకటి రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌ - parliament news

కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ భరత్‌ విమర్శించారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసనని ఉద్ఘాటించారు.

MP Bharat
ఎంపీ భరత్‌
author img

By

Published : Sep 21, 2021, 1:30 PM IST

Updated : Sep 21, 2021, 7:15 PM IST

సీఎం జగన్ నమ్మకంతో తనకు వైకాపాలో ఎంపీగా అవకాశం ఇచ్చారని భరత్‌ తెలిపారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని ఆక్రోశించారు. తెదేపా నేతలతో కుమ్మక్కై ఉంటే సాక్ష్యాలు చూపించండని సవాల్ విసిరారు ఎంపీ భరత్‌.

ఇదీ చదవండి : సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

తమ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనని ఎంపీ భరత్‌ స్పష్టం చేశారు. వీవీ.లక్ష్మీనారాయణతో సెల్ఫీలు తీసుకున్నానని వస్తున్న విమర్శలను భరత్ తిప్పికొట్టారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసనని ఉద్ఘాటించారు.

వీవీ.లక్ష్మీనారాయణతో తాను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించేవారు... అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాపు సమావేశంలో లక్ష్మీనారాయణను కలిశానని తెలిపారు. పార్లమెంటులో చాలా బాగా మాట్లాడానని లక్ష్మీనారాయణ తనతో అన్నారని భరత్‌ వివరించారు. అంతేకాని నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదని... వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుందని ఎంపీ భరత్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : గోదావరిలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం.. గాలింపు ముమ్మరం

Last Updated : Sep 21, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.