ETV Bharat / state

భార్య గెలుపు వార్త విన్న కాసేపటికే భర్త మృతి - భార్య గెలుపు వార్త విన్న మరుక్షణమే భర్త మృతి

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపు సాధించిన ఆమెకు... విజయానందం ఎంతోసేపు నిలవలేదు. కౌన్సిలర్​ కాబోతున్నాననే ఆనందం కంటే భర్తను కోల్పోయాననే వేదనే ఆమెకు మిగిలింది. 18 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. భార్య గెలుపు వార్త విన్న కొద్దిసేపటికే భర్త కన్నుమూసిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.

husband died in amalapuram
భార్య గెలుపు వార్త విన్న కాసేపటికే భర్త మృతి
author img

By

Published : Mar 15, 2021, 6:52 AM IST

భార్య మున్సిపల్​ ఎన్నికల్లో విజయం సాధించిందని తెలిసిన కాసేపటికే భర్త మరణించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. అమలాపురం మున్సిపాలిటీలోని పదో వార్డు వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన కొల్లాటి నాగ వెంకట దుర్గాబాయి 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అయితే గత 18 రోజులుగా ఆమె భర్త వీర్రాజు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య గెలుపు వార్త విన్న మరుక్షణమే ఆయన కన్నుమూశారు. దీంతో విజయం సాధించిన ఆనందం ఆమెకు ఎంతసేపు నిలువలేదు. మరోవైపు దుర్గాబాయి తల్లి లక్ష్మీ మాణిక్యం ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు భర్త మరణం.. ఆమెను మరింత కలచివేసింది.

ఇదీ చదవండి:

సీటు దక్కలేదని​ మహిళా సెల్​ అధ్యక్షురాలు శిరోముండనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.