ETV Bharat / state

ఇళ్లు కూల్చేసి..  భూసేకరణ - తూర్పు గోదావరిలో టీడీపీ హయాంలో కేటాయించిన స్థలాలను తిరిగి తీసుకున్న అధికారులు

తూర్పుగోదావరి జిల్లా ఎస్​ పైడిపాల గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ ప్రారంభించారు అధికారులు. అందుకోసం గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న తమను బలవంతంగా ఖాళీ చేయించి, ఇళ్లు కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గత అధికారులు ఇచ్చిన పట్టాలు చెల్లవని... ఇళ్లు ఖాళీచేయాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ ఇళ్లను కూల్చేసి, మళ్లీ తమకే స్థలాలు ఇస్తామంటున్నారని, ఇదేక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

ఇళ్లు కూల్చేసి..ఇళ్ల స్థలాలకు భూసేకరణ
ఇళ్లు కూల్చేసి..ఇళ్ల స్థలాలకు భూసేకరణ
author img

By

Published : Jun 11, 2020, 6:56 PM IST

ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ చేపట్టిన అధికారులు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామంలో పేదల ఇళ్లు కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాల్లో కొందరు ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం గతంలో కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు స్థానిక నాయకులు పూనుకున్నారని బాధితులు ఆరోపించారు. స్థానిక నేతలకు అధికారులు తోడై తమ ఇళ్లను కూల్చేశారని తెలిపారు.

ఇరవై సంవత్సరాలుగా నివాసముంటున్న స్థలాల్లోంచి.. వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారన్నారు. ఇళ్లు కూల్చకుండా... కోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చినా బలవంతంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన పట్టాలు చెల్లవంటున్నారని వాపోతున్నారు. కరోనా విజృంభిస్తున్న కాలంలో.. నిలువ నీడ లేకుండా చేస్తున్నారని విలపిస్తున్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన ఇళ్లను కూల్చమని స్థానిక ఎమ్మార్వో అబ్బాస్ చెప్పారు.

ఇదీ చదవండి : 'కక్షసాధింపు ధోరణితోనే సీబీ'ఐ'.. మీ అవినీతిపై విచారణ చెయ్యించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.