రుతు పవనాల ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట, అమలాపురం, మామిడికుదురు, మండపేట, కాకినాడ, మన్యంలో విస్తారంగా, అయినవల్లి, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేటల్లో మోస్తారు వర్షం పడింది. రాజమహేంద్రవరంలో గత పది రోజులు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. భారీగా కురుస్తోన్న ఈ వానలకు రహదారులు జలమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోని నారుమళ్లు నీట మునిగాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.