స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయడం కాదని, మొత్తం ప్రక్రియనే మొదటి నుంచి చేపట్టాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్నికల సంఘాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. విదేశాల నుంచి రాకపోకలను కొంతకాలం నిషేధించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న బంధువుల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని... కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేయడం ఆహ్వానించదగినదే అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఆరువారాల గడువు ఉందని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కరోనాపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: నామినేషన్ల ప్రక్రియ మరోసారి నిర్వహించాలి: పవన్