తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం బాధితుడు ప్రసాద్ కేసును ప్రభుత్వం నీరుగార్చేసిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. ఎవరిని రక్షించాలని ప్రభుత్వం... శిరోముండనం కేసును నీరు గార్చుతోందన్న విషయం అందరికీ తెలిసిందేనని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కేసుపై రాష్ట్రపతి ఒక అధికారిని నియమించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ అధికారినీ బాధితుడి వద్దకు పంపించలేదని ఆగ్రహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, తెలుగుదేశం అధినేత చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవడంపైనా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. స్టీల్‌ప్లాంట్ అంటే ఒక సెంట్మెంట్ అనీ.. అటువంటి దాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ