పశ్చిమగోదావరి జిల్లాలో...
తణుకులో కనకదుర్గమ్మ... లలితా త్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు... అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
అమలాపురంలో కొలువైన శ్రీదేవి అమ్మవారు... ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. మాజీ హోంమంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప... అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం చినరాజప్పను ఆలయకమిటీ సభ్యులు సత్కరించారు. యానాంలోని సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. శివాలయం వీధిలో ఉన్న కన్యకా పరమేశ్వరి... మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విశాఖపట్నం జిల్లాలో...
విశాఖ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు.. రాజశ్యామల అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. పద్మాసనంపై ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి.... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజున అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పూజలు చేస్తున్నారు.
ఇదీచదవండి.