ETV Bharat / state

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి - financial help to flood victims

వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.

financial help to flood victims
ఆర్థిక సాయం అందిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Oct 20, 2020, 10:18 AM IST

భారీ వర్షాలకు ఇళ్లు మునిగిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి, పల్లమాంబిక నగర్, బాబానగర్​లలో ఆయన పర్యటించారు. వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.500 ఆర్థిక సాయాన్ని అందించారు. మూడు రోజుల్లో 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళాదుంపలు పంపిణీ చేయటానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని.. అర్హులందరికీ అందుతాయని తెలిపారు. పేదల పొట్ట నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని..ప్రజలు వాటిని నమ్మవద్దని చెప్పారు.

ఇదీ చదవండి:

మన్యంలో కుండపోత వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.