తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకులను బురిడీ కొట్టించి... రూ.700 కోట్లు రుణం పొందిన వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. బ్యాంకులను మోసగించిన అంశంపై గతేడాది మే, అక్టోబర్ నెలలో... కాకినాడ, అనపర్తి, బిక్కవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు... రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి. యాక్సిస్, లక్ష్మీ విలాస్, గుంటూరు-డీసీసీబీ, కరూర్ వైశ్య బ్యాంకులు సహా.... మహారాష్ట్ర ఇన్ఫినిటీ బ్యాంకులోనూ రుణాలు పొందినట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించారు.
గోదాముల్లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు చూపి రుణాలు తీసుకున్న వ్యాపారులు... ఆ తర్వాత వాటిని మాయం చేసినట్లు పోలీసులు తేల్చారు. కొందరు బ్యాంకు ఉద్యోగులు, గోదాములను పర్యవేక్షించే ప్రైవేటు ఏజెన్సీలతో కుమ్మక్కై ఈ వ్యవహారం సాగించినట్లు గుర్తించారు. అయితే ఆయా బ్యాంకుల యాజమాన్యాలు, గోదాముల నిర్వహణ యాజమాన్యాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల.... కేసును సీబీఐకి అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: