నదుల్లో వరదలు తగ్గినా... ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావడం లేదని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.1200 కోట్ల ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న విజయవాడలో ఇసుక కొరతపై చంద్రబాబు చేయనున్న దీక్షకు.. కార్మికులందరూ మద్దతుగా నిలవాలని కోరారు.
ఇదీ చూడండి: 'మాతృభాషను చంపేస్తామంటే ఊరుకోం'