చలో ఆత్మకూరు భగ్నంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. మానవ హక్కుల సంఘానికి ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మొట్టికాయ వేశాక జగన్ ప్రభుత్వం పీపీఏలపై వెనక్కి తగ్గిందన్నారు. ఒక్క జిల్లాలోనే సన్నబియ్యం ఇవ్వలేనివాళ్లు 13 జిల్లాల్లో ఎలా ఇస్తారని ఆరోపించారు. ఇసుక 4 రెట్లు అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారో సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.
ఇదీ చదవండి